April 16, 2017

ABN-radhakrishna-17-4-16

తెలుగుదేశం పార్టీకి జాకీలు వేయడమే పనిగా పెట్టుకున్న మీడియాధినేతక ఆంధ్రజ్యోతి అధిపతి రాధాకృష్ణకు రాజ్యసభ సభ్యత్వం ఖాయమైనట్టు సమాచారం. త్వరలో ఏపీ కోటాలో జరిగే రాజ్యసభ సభ్యుల నియామకాల్లో ఆయనను డిల్లీకి పంపనున్నాడట తెలుగుదేవం అదినేత. ఆయన నడమంత్రపుమీడియాధి పతి ఎవరోప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా జాకీలు వేసే పత్రిక ఒకటి ఉండగా, దానికి తోక పత్రికగా మరోటి ఉంది.

ఆ తోక పత్రిక యజమానే ఈయన. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసి.. దించేసిన వేళ నుంచి ఆయన వెంటే ఉన్నాడు. ఆ ప్రాపకంలో బాబు పదవిలో ఉన్న వేళ సొంతంగా పేపర్ పెట్టాడు. ఆ తర్వాత టీవీ చానల్ ను పెట్టాడు ఓపెన్ హార్ట్ సర్జన్ లా తెగ ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉంటాడు. ఏం చేసినా.. ఎలా చేసినా. అందులో బాబు ప్రయోజనాలను కోరుకోవడం ఈ జర్నలిస్టు ప్రత్యేకత.

ఆ నేపథ్యమే ఇప్పుడు ఆయనను ఎంపీగా చేయబోతోందట. ఈయన రాజ్యసభ సభ్యత్వం కోసం చాన్నాళ్లుగానే యత్నాలు చేస్తున్నాడు. ఎట్టకేలకూ చంద్రబాబు కరుణ లభించినట్టుగా ఉంది. మరి ఈ మీడియాధిపతిగా ఉండి, తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు వెళితే అది రాజకీయం కదా, అనుబందం అంతా అందరికీ అర్థం అయిపోతుంది కదా.. అనొచ్చు అయినా ఇప్పటికే అందరికీ అంతా అర్థం అయిపోయింది కదా.. ఇక కొత్తగా పోయేదేముంది?