July 12, 2017

Aamir-khan-Chandra-Mahesh

బాలీవుడ్ మిస్ట‌ర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తెలుగు ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌బోతున్నాడా? ఇండియా రికార్డులు షేక్ చేస్తున్న టాలీవుడ్‌పై అమీర్ భారీ ఆశ‌లు పెట్టుకున్నారా? సీన్ చూస్తుంటే అలాగే క‌నిపిస్తోంది. నిజానికి అమీర్ సినిమా అంటే సంచ‌ల‌న‌మే. ఆయ‌న స్టోరీ ఎంచుకున్న‌ప్పుడే దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మ‌వుతుంది. ఇక సినిమా విడుద‌లైతే ఊపిరాడ‌ని కొత్త రికార్డులు న‌మోద‌వుతూనే వుంటాయి.

కేవలం కథ నచ్చి అమీర్ ఖాన్ ఎన్నో సినిమాలు చేశాడు, అసుతోస్ గోవారికర్ తో లగాన్ , అస్క్ వంటి ప్లాప్ మూవీ చేసిన ఓమ్ ప్రకాశ్ మెహ్ర తో రంగ్ దే బసంతి , రీమాకాగ్టి తో తలాస్ వంటి గొప్ప మూవీస్ చేశారు. అలాగే సౌత్ లో రామ్ గోపాల్ వర్మ తో రంగీలా, మురగదాస్ తో గజిని తరువాత మరో సౌత్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి అంగీకారంచినట్లు తెలుస్తుంది. చాలా కాలంగా సక్సెస్ లేని చంద్రమహేష్ అనే తెలుగు దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చి అమీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ లో హట్ టాపిక్ అవుతోంది. ప్రేయ‌సిరావే, అయోద్య‌రామ‌య్య‌, హ‌నుమంతు... వంటి సినిమాలు తెర‌కెక్కించిన చంద్ర‌మ‌హేష్ చెప్పిన స‌బ్జెక్టు అమీర్‌కు బాగా న‌చ్చింద‌ని, త్వ‌ర‌లోనే ఈ సినిమా తీయ‌బోతున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో అమీర్ స‌ర‌స‌న హీరోయిన్‌గా నిత్య‌మీన‌న్‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్టు టాక్. మొత్తానికి ఒక తెలుగు ద‌ర్శ‌కుడితో అమీర్ సినిమా చేస్తాడ‌ని వ‌స్తున్న వార్త‌లు ఇప్పుడు టాలీవుడ్‌లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.