January 09, 2018

Agnathavasi-18-1-9

పవన్ కళ్యాణ్ తాజా మూవీ అజ్ఞాతవాసి సినిమాకు తెలంగాణా పోలీసులు షాకిచ్చారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోలు ప్రదర్శించేందుకు అనుమతి నిరాకరించారు. ఏపీ ప్రభుత్వం ఈ చిత్రాన్ని అర్దరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 10 గంటలమధ్య స్పెషల్ షోలు వేసేందుకు అనుమతించింది.

తెలంగాణాలోనూ ఈ వెసులుబాటు ఉంటుందని భావించినా..తొక్కిసలాట జరిగే అవకాశం ఉందన్న కారణంతో పోలీసులు ఇలాంటి స్పెషల్ షోలకు పర్మిషన్ నిరాకరించారు. భ్రమరాంబ, మల్లికార్జున, ఆర్కే థియేటర్లలోపవన్ ఫ్యాన్స్ కోసం అర్ధరాత్రి ప్రత్యేక షోలు వేసేందుకు ఏర్పాట్లు చేసినా పోలీసులు అనుమతించలేదు. దీంతో బుధవారం ఉదయం 8 గంటలకు మొదటి షో ప్రదర్శించనున్నారు.