November 13, 2017

neha-sharma-ajith-sharma

బిజినెస్ మ్యాన్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన అజీత్‌శర్మపై నేషనల్ హైవే భూమిని కబ్జాచేసి హోటల్ పార్కింగ్ ఏర్పాటు చేశాడనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే అజీత్ కుమార్తెలు నేహాశర్మ, అయేషాశర్మ ఇద్దరూ ఫేమస్ నటులుగా వెలుగొందుతున్నారు.

అజీత్ శర్మ 2014లో బీహార్ ఉప ఎన్నికల్లో భగల్‌పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ సమయంలో అతనికి జేడీయూ, ఆర్‌జేడీ‌ల నుంచి మద్దతు లభించింది. 2015లో బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయేషా, నేహాలు తండ్రి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీరిని చూసేందుకు జనం తరలివచ్చారు. కాగా నేహాశర్మ ‘చిరుత’ సినిమాలో రామ్‌చరణ్ సరసన నటించింది.