MLA-Jaleel-Khan-16-12

ఒక నిమిషం వీడియోతో సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు టీడీపీ విజ‌య‌వాడ వెస్ట్ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్. బీకాంలో మ్యాథ్స్.. ఫిజిక్స్ ఉంటాయంటూ ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌ల‌తో పెద్ద కామెడీ పీస్ అయిపోయాడు జ‌లీల్‌.

నిన్న‌ట్నుంచి సోష‌ల్ మీడియాలో ఈ వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో తెగ ఫార్వార్డ్ అవుతోంది. ట్విట్రర్.. ఫేస్ బుక్కుల్లోనూ ఆ వీడియో వైర‌ల్ అవుతోంది. ముందు ఈ వీడియో చూసి ఆస్వాదించిన నెటిజ‌న్లు ఇప్పుడు త‌న క్రియేటివిటీ చూపిస్తూ కామెడీ పండిస్తున్నారు. కొత్త జోకుల‌తో క‌డుపుబ్బ న‌వ్విస్తున్నారు.

‘కింగ్’ సినిమాలో మ్యూజిక్ కాంపిటీష‌న్లో బ్ర‌హ్మానందం త‌న అజ్నాన ప్ర‌ద‌ర్శ‌న‌తో చేసే కామెడీని ఎవ్వ‌రూ మ‌రిచిపోలేరు. ఇప్పుడు జ‌లీల్ ఖాన్‌ను బ్ర‌హ్మి ప్లేస్‌లో పెట్టి ఆ సీన్‌కు స్పూఫ్ రెడీ చేసేశాడు ఒక నెటిజ‌న్. మ‌రో నెటిజ‌న్ ‘ఆది’ సినిమాలో ఎల్బీ శ్రీరామ్ బూస్ట్ కామెడీని గుర్తు చేస్తూ జ‌లీల్ ఖాన్ మీద జోకులు పేల్చాడు.

ఇంకో వైపు ఈ మ‌ధ్య కాలంలో బాగా పాపుల‌ర్ అయిన ఆరోక్య మిల్క్ అడ్వ‌ర్టైజ్మెంట్‌ను కూడా జ‌లీల్ ఖాన్ మీద కామెడీ చేయ‌డానికి వాడేశారు. ఇంకా సోష‌ల్ మీడియాలో జ‌లీల్ ఖాన్ మీద బోలెడు జోకులు పేలుతున్నాయి. నిన్న‌టి దాకా విజ‌య‌వాడ వాళ్ల‌కే తెలిసిన జ‌లీల్ ఖాన్.. ఇప్పుడు సూప‌ర్ పాపులారిటీతో జ‌నాల్లో బాగానే రిజిస్ట‌ర్ అయిపోయాడు.