Janet-Jackson-17-1-4

యాభై ఏళ్లలో తల్లి అవడం - అందులోనూ టాప్ పాప్ స్టార్ అంటే అది తప్పనిసరి వార్తే కదా?! ఇలాంటి వార్తకు కారణం అమెరికన్ పాప్ స్టార్ జానెట్ జాక్సన్. 50 ఏళ్ల వయసులో తల్లయిన జాక్సన్ ఓ బాబుకు జన్మనిచ్చినట్లు జానెట్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆ బాబుకు ఐసా అని పేరు పెట్టారు. 2012లో ఖతార్ కు చెందిన విసామ్ అల్ మనాను జానెట్ పెళ్లి చేసుకుంది. వారికి ఇదే తొలి సంతానం. జానెట్ కు సుఖప్రసవం అయిందని ప్రస్తుతం ఆమె బాగానే ఉందని ఆమె ప్రతినిధి తెలిపారు.

గతేడాది ఏప్రిల్ లో ఆమె గర్భవతి అన్న పుకార్ల మధ్య తన టూర్ ను జానెట్ వాయిదా వేసుకుంది. తాను తన భర్త ప్లానింగ్ చేస్తున్నామని అందుకే టూర్ ను వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఓ వీడియోలో ఆమె తెలిపింది. ఆ తర్వాత చాలాకాలం పాటు ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సెప్టెంబర్ లో ఓ షాపింగ్ మాల్ లో కనిపించింది. ఆ సందర్భంగా ఆమె గర్భవతిగా ఉన్న ఫొటోలు ఎంటర్ టైన్ మెంట్ టుడేలో పబ్లిష్ చేశారు. ఆ తర్వాత అక్టోబర్లో ఓ ఇంటర్వ్యూలో జానెట్ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. తాజాగా ఆమె ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు.