February 11, 2018

KTR-Toli-prema

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సినిమాల పట్ల ఆసక్తికనబరుస్తారన్న విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీలతో స్నేహపూర్వకంగా ఉండే ఆయన.. తరచూ సినిమాలు చూస్తూ తన అభిప్రాయాన్ని కూడా సోషల్‌ మీడియాలో తెలియజేస్తుంటారు. తాజాగా ఆయన తొలిప్రేమ చిత్రాన్ని చూసి ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.

‘‘శనివారం రాత్రి అద్భుతంగా గడిచింది. తొలిప్రేమ లాంటి ఓ సున్నితమైన ప్రేమకథను చూశాను. దర్శకుడు వెంకీ అట్లూరి బాగా తెరకెక్కించాడు. రాశీ ఖన్నా, వరుణ్‌ తేజ్‌ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ముఖ్యంగా మంచి సాహిత్యం.. దానికి థమన్‌ టెర్రిఫిక్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకున్నాయి’’ అని కేటీఆర్‌ గత రాత్రి ట్వీట్‌ చేశారు.

ఈ పొగడ్తలకు స్పందించిన తమన్.. మీరు మా సినిమా చూడడమే గాక.. దీనిపై ప్రశంసలు కురిపించడం ఆనందంగా ఉందని..మా ఫేవరేట్ లీడర్ నుంచి లభించిన ప్రశంసలతో మా టీమ్ చాలా హ్యాపీగా ఉందని రీ-ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ గ్రేట్ జాబ్ తమన్ అని అభినందనలు తెలిపారు.