April 16, 2017

kalyan-ram-17-4-16

శతమానం భవతి చిత్రం సాధించిన ఘన విజయం.. ఇప్పుడు నేషనల్ అవార్డ్ కూడా దక్కడంతో.. మరింతగా పెరిగింది. అందుకే శతమానం టీంను అభినందించడానికి ప్రత్యేకంగా ఓ కార్యక్రమం నిర్వహించారు అల్లు అరవింద్.

'శతమానం భవతి చిత్రం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా చేయచ్చు కదా.. ఎప్పుడూ పొడుచుకోవడం.. నరుక్కోవడం లాంటివే చేస్తారేంటి అని మా ఆవిడ అడిగింది. అంతలా ప్రతీ ఒక్కరూ మెచ్చిన చిత్రం శతమానం భవతి' అన్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనను ప్రత్యేకంగా ప్రశంసించాడు నందమూరి హీరో.

'ఇలాంటి కార్యక్రమం నిర్వహంచాలనే ఆలోచన చేసిన చిరంజీవి గారు.. అల్లు అరవింద్ గారు.. బన్నీలను ప్రశంసించాలి. తనే ఓ నిర్మాత అయ్యి.. మరో నిర్మాతకు గుర్తింపు వచ్చినపుడు అభినందించాలనే ఆలోచన చాలా గొప్పది' అన్నాడు కళ్యాణ్ రామ్.