October 07, 2017

lakshmi-rai-hanif-hilal

ముందు హీరోయిన్ గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా సరైన హిట్ దొరక్క ఆ తర్వాత ఐటం సాంగులతో హీటెక్కించిన సుందరాంగి రాయ్ లక్ష్మి. మెగా స్టార్ కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150లో రత్తాలు పాటకు అమ్మడు వేసిన మాస్ స్టెప్పులకు ప్రేక్షకుల్లో మంచి ఊపే వచ్చింది.

రాయ్ లక్ష్మి సినిమాల కన్నా డేటింగ్ కబుర్లతో ఎక్కువగా వార్తల్లోకెక్కుతూ ఉంటుంది. ఆ మధ్య క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో చెట్టపట్టాలేసుకుని తిరిగిందనే న్యూస్ వచ్చింది. ఆ తర్వాత ఓ బిజినెస్ మ్యాగ్నెట్ తో క్లోజ్ గా ఉందని బాలీవుడ్ లో తెగ ప్రచారం జరిగింది. ఇప్పుడు రాయ్ లక్ష్మి తాజాగా ముంబయిలోని ఓ మోడల్ తో డేటింగ్ చేస్తోందనే బాలీవుడ్ మీడియా అంటోంది. మోడలింగ్ తో పాటు అడపా దడపా సినిమాల్లో కనిపించే హనీఫ్ హిలాల్ అనే మోడల్ తో బాగా సన్నిహితమైందని లేటెస్ట్ టాక్.

మూడు పాటలు.. ఆరు డ్యాన్సులుగా కెరీర్ సాగిపోతున్న తరుణంలో అనుకోని విధంగా రాయ్ లక్ష్మికి బాలీవుడ్ ఎరోటిక్ సినిమాలో హీరోయిన్ గా అవకాశమొచ్చింది. ప్రస్తుతం జూలీ-2 సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. అనుకోకుండా వచ్చిన అరుదైన అవకాశం కావడంతో ప్రేక్షకులను మెప్పించేందుకు ఈ సినిమా కోసం ఇంతకుముందుకన్నా మరింత సెక్సీగా కనిపిస్తూ తన అందచందాలను వెండితెరపై ధారాళంగా ఆరబోస్తోంది రాయ్ లక్ష్మి. అటు జూలీ.. ఇటు ప్రియుడు.. చూద్దాం చివరకు ఏమవుతుందో.