January 09, 2018

Mahesh-Kathi-18-19

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సంక్రాంతి సెలవులిచ్చేశానంటున్నాడు ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్! పవర్ స్టార్ మీద, జనసేన పార్టీ మీద దండయాత్ర మొదలుపెట్టి, సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా నలిగి, నానిపోయిన కత్తి మహేష్.. ”నేను అలసిపోయాను, పవన్ కళ్యాణ్ ని పట్టించుకునే ఓపిక, తీరిక నాకు లేదు. పండక్కి ఊరెళ్తున్నా, 14 తర్వాత మళ్ళీ కొత్త ‘స్టఫ్’తో దూకేస్తా”నంటూ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు.

తనకు, పవన్ కి మధ్య పానకంలో పుడకలా వచ్చిన పూనమ్ కౌర్, హైపర్ ఆది, వేణుమాధవ్, కోనా వెంకట్ లాంటివాళ్ళక్కూడా ‘రిలీఫ్’ కావాలి కనుక.. ఈ నాలుగురోజులూ దూరంగా వెళ్తున్నానన్నాడు కత్తి మహేష్. ఈలోగా పవన్ ఫ్యాన్స్ కి ‘అజ్ఞాతవాసి’ సందడి వుండనేవుంది. అయినా.. అజ్ఞాతవాసంలోకి వెళితే మాత్రం.. కత్తి మహేష్ కి అర చేతిలో సోషల్ మీడియా ఉండకుండా ఉండదు. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఆ కత్తిని అంత సులభంగా వదిలిపెడతారన్న గ్యారంటీలూ లేవు. సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారు, గొబ్బెమ్మలు పెట్టారా, పిండివంటలు తింటున్నారా అంటూ కెమెరాలేసుకుని ఆయన వెంటబడకుండా ఉండరు. ఏదేమైనా.. పండగ సెలవుల తర్వాత.. కత్తి మరింత పదునెక్కుతుందా.. లేక వాడకం తగ్గి తుప్పు పట్టిపోతుందా అనేది సస్పెన్స్.