July 12, 2017

NTR-puri-jagannadh-17-7-12

తాజాగా జై లవకుశ సినిమా టీజర్ విడుదల అవ్వడం జై పాత్రకి సంబంధించి మంచి రెస్పాన్స్ రావడం, ఆ పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయాడు అనీ నెగెటివ్ రోల్స్ చెయ్యాలి అంటే ఎన్టీఆర్ ని మించి ఎవ్వరూ ఇండస్ట్రీ లో లేరు అనే మాట అందరి నోటా వినపడడం తో ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటు డైరెక్టర్ బాబీ కూడా ఫుల్ ఖుషీ గా ఉన్నాడు.

అయితే సడన్ ఆ జై పాత్ర నిజానికి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రాసిన క్యారెక్టర్ అంటూ మీడియా లో వార్తలు వచ్చాయి. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన హీరోల క్యారెక్టర్ లు చాలా పర్ఫెక్ట్ గా రాస్తారు. హీరో లో యాటిట్యూడ్ కానీ నెగెటివ్ ఫీల్ కానీ బాగా బయటకి లాగుతారు అదే విధంగా ఈ సినిమా కి కూడా పూరీ ఇదివరకు రాసుకున్న క్యారెక్టర్ ని కాపీ చేసారు అని టాక్.అయితే ఈ విషయం మీడియా లో చూసిన పూరీ కూడా తన క్యారెక్టర్ ని దొంగలించారు అని చాలా సీరియస్ అయ్యారట.

పూరీ జగన్నాథ్ తో గొడవలు మంచివి కావు అనే ఉద్దేశ్యం తో ఎన్టీఆర్ - పూరీ ఇద్దరూ మాట్లాడుకుని రాజీ కుదుర్చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు, పూరీకి మరోసారి దర్శకత్వం అవకాశం ఇస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చాడట. దీనికి పూరీ కూడా ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారం అయిపోయింది.