nagarjuna-16-11-19

తెలుగు స్టార్ అక్కినేని నాగార్జున తనపై వస్తున్న రూమర్స్ తో హర్ట్ అయ్యాడు. వెంటనే ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. అక్కినేని నాగార్జున తన పేరు మీద, అన్నపూర్ణ స్టూడియోస్ మీద పలు బ్యాంకుల వద్ద చాలా అప్పులు తీసుకున్నాడని, వాటిని కట్టకుండా ఎగ్గొట్టాడంటూ ప్రచారం మొదలైంది. దీనిపై నాగార్జున వివరణ ఇచ్చారు. బ్యాంకులకు తాను కాని, అన్నపూర్ణ స్టూడియోస్ కాని ఎలాంటి అప్పులు ఎగ్గొట్ట లేదని, అన్నీ కట్టేసానని, తాము అప్పులు ఎగ్గొట్టామంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని... వారందరికీ ఈ విషయాన్ని చెబుతున్నాను అంటూ నాగార్జున ట్వీట్ చేసారు.

అన్నపూర్ణ స్టూడియోస్ అభివృద్ధి కోసం ఇంతకు ముందు బ్యాంకుల నుంచి కొంత అప్పు తీసుకున్న మాట నిజమే, ఈ ఏడాది ప్రారంభంలోనే వాటన్నిటినీ చెల్లించేశామని నాగార్జున ట్విట్టర్లో స్పష్టం చేసారు.

బ్యాంకులకు తాను కాని, అన్నపూర్ణ స్టూడియోస్ కాని ఎలాంటి బకాయిలు పడలేదని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పష్టం చేశారు.

అన్నపూర్ణ స్టూడియోస్ డెవలప్‌మెంటు కోసం నాగార్జున అప్పు తీసుకున్నారు. సమయానికి అప్పు తీర్చక పోవడంతో బ్యాంక్ వారు నోటీసులు కూడా పంపారని, సీజ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయంటే ఆ మధ్య వార్తలు వచ్చాయి.

మాటీవీలో నాగార్జునకు కూడా వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య మాటీవీ అమ్మేసారు.... ఈ డీల్ ద్వారా భారీగానే డబ్బు ముట్టిందని, అలా వచ్చిన డబ్బుతో నాగార్జున అప్పులన్నీ తీర్చేసారని అంటున్నారు. ఏది ఏమైనా నాగార్జున, అన్నపూర్ణ స్టూడియోస్ ఎవరికీ ఎలాంటి బకాయిలు పడలేదనేది స్పష్టమవుతోంది.