April 16, 2017

pawan-mahesh-17-4-16

ప్రిన్స్ మహేశ్ బాబు సినిమాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అడ్డుపుల్ల వేస్తున్నాడా? ఇప్పటికే టైటిల్ కూడా ఫిక్సయిపోయిన మహేశ్ సినిమాకు పవన్ అడ్డుగా మారుతున్నాడా? అంటే ఔను అని అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. ముందుగా ఉన్న లెక్క ప్రకారం చూస్తే.. ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా నటిస్తున్న సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శితో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాకు ఇప్పటికే ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ఫిక్సయ్యింది కూడా.

దేవీశ్రీ ప్రసాద్ ఆ సినిమా కోసం పని ప్రారంభించాడు. మరి అంతా ఓకే.. మురగదాస్ తో సినిమా పూర్తి కాగానే మహేశ్ ఆ సినిమాను తెరకెక్కిస్తాడని అనుకుంటే.. ఇంతలో కొరటాలతో సినిమా అంటూ పవన్ కల్యాణ్ అడ్డొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఆ సినిమా పూర్తి కాకుండానే కొరటాలను లైన్లో పెట్టాడట పవన్.

కొరటాల చెప్పిన లైన్ నచ్చడంతో ఆ సినిమాను పట్టాలెక్కించమని ఆయన కోరాడట. దీంతో ఈ ప్రభావం మహేశ్ సినిమా మీద పడనుంది. మహేశ్ హీరో తను రూపొందించాల్సిన సినిమా కంటే ముందేద.. కొరటాల పవన్ సినిమాను చేపట్టనున్నాడని సమాచారం. దీంతో.. త్వరలోనే మురగదాస్ తో సినిమా పూర్తి చేయనున్న మహేశ్ చేతిలో మరే సినిమానూ లేకుండా పోనుంది. మొత్తానికి ఈ విధం పవన్ కల్యాణ్ మహేశ్ సినిమాకు అడ్డంకిగా మారుతున్నాడనమాట!