October 07, 2017

bjp-leader-rapist

పంజాబ్ లో బీజేపీకి ఇదో పెద్ద దెబ్బ ! ఆ రాష్ట్ర గురుదాస్ పూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఈ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్వరణ్ సలారియా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ సుమారు 45 ఏళ్ళ మహిళ ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి 32 సంవత్సరాలుగా మోసగిస్తూ వచ్చాడని ఆమె పేర్కొంది. అతనితో తను ఇంటి మేట్ గా ఉన్న ఫోటోలను ఆమె బయటపెట్టింది.

ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1982-2014 మధ్యకాలంలో సలారియా తనకు ఓ పేయింగ్ గెస్ట్ హౌస్ కేటాయించి ఎన్నో హామీలిచ్చాడని, చివరకు తాము మోసపోయానంటూ బాధితురాలు సుప్రీంకోర్టుకే ఎక్కింది. నీతో పెళ్లి ప్రసక్తే లేదని 2014 లో చెప్పాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ముంబైకి చెందిన ఈ బాధితురాలి ఆరోపణలను స్వరణ్ సలారియా కొట్టిపారేశాడు. తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఆమె ఈ ఆరోపణలు చేస్తోందని అన్నాడు. కాగా.. ఇతని నామినేషన్ ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది.