October 07, 2017

renudesai-pawan-kalyan-17-10-7

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ స‌డ‌న్‌గా తెర‌మీద‌కు ఎందుకు వ‌చ్చారు..? ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని, ప‌రోక్షంగా ప‌వ‌న్‌ని.. ఆమె ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? దీనివెనుక కుట్రకోణం ఏదైనా దాగి ఉందా..? తెలుగు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వ‌చ్చేనెల‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించ‌బోతున్న త‌రుణంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తానూ ఓ యాత్ర చేయ‌బోతున్నాన‌ని ఇటీవ‌ల ప్రక‌టించారు.

జ‌గ‌న్ యాత్రకి పోటీగా ప‌వ‌న్‌ యాత్ర ఉండ‌బోతోంద‌న్న టాక్ కూడా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో న‌డుస్తోంది. పవన్ కారణంగా త‌న పాదయాత్ర డిస్టర్బ్ కాకూడదన్న ఉద్దేశ్యంతోనే రేణు అస్త్రాన్ని జ‌గ‌న్‌ ప్రయోగించాడా అన్న అనుమానం ఇప్పుడు తెలుగుదేశం వ‌ర్గాల్లో నెల‌కొంది. ప‌వ‌న్ దూకుడుకి క‌ళ్ళెం వేయాల‌ని తెలుగుదేశం నాయ‌కులే రేణుదేశాయ్‌ని ప్రయోగించార‌న్నది వైసీపీకి ఉన్న మరో అనుమానం..! ఇంత‌కీ రేణు వెనుక ఎవ‌రున్నారు..? కుట్రకోణంలోనే రెండువ‌ర్గాలు ఈ అంశాన్ని చూస్తున్నాయి.