Sridevi-jhanvi-kapoor-17-1-15

కఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి త్వరలో తన కూతురు జాన్వి కపూర్‌ను హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నటన, సినిమా రంగానికి సంబంధించిన ఇతర అంశాల్లో శిక్షణ తీసుకున్న జాన్వి వచ్చే ఏడాది సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

అయితే కొంత కాలంగా జాన్వి కపూర్ ... సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారితో ప్రేమాయణం నడుపుతుందని టాక్. అయితే ఇప్పటి వరకు చేసింది చాలు... అతడితో బ్రేకప్ చేసుకుని కెరీర్ మీదే పూర్తి ఫోకస్ పెట్టాలని శ్రీదేవి తన కూతురు మీద ఒత్తిడి తెస్తున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రేమలో ఉన్న వారికి తల్లిదండ్రుల చెప్పే ఇలాంటి మాటలు ఎక్కడం కష్టమే. మరి జాన్వి కపూర్ శ్రీదేవి మాట వింటుందా? లేదా? అనేది ఆసక్తి కరమే.