February 11, 2018

Sunny-Leone-18-2-11

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కు అరుదైన అవకాశం లభించింది. మొట్టమొదటిసారిగా సౌత్ లో ఫుల్ ప్లేడ్జ్ (పూర్తి స్థాయి) రోల్ లో నటించనుంది. తమిళంలో వీరమాదేవి అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం తెలుగులో వీరమహాదేవి అనే టైటిల్ పేరిట విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, మళయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి వి.సి.వడివుడయన్ దర్శకుడు. స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టీఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బుధవారం ఈ సినిమా షూటింగ్ మొదలైంది. సన్నీ లియోన్ ఈ సినిమాలో పవర్ ఫుల్ క్వీన్ పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం కోసం ఆమె కత్తిసాము,గుర్రపు స్వారీ నేర్చుకోవడం విశేషం. యుద్ధ సన్నివేశాలకోసం స్పెషల్ ట్రెయినింగ్ కూడా పొందింది. పైగా 150 రోజుల కాల్షీట్స్ కూడా ఇచ్చిందట నవదీప్, నాసర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ఈ చిత్రం నేపథ్యంలో సన్నీ..ఇటుకలను ఒంటిచేత్తో ఒకే దెబ్బకు పడగొడుతున్న ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేసింది.