January 09, 2018

gundu-hanumantha-rao

కిడ్నీ సంబంధ అనారోగ్యంతో బాధ పడుతున్న హాస్య నటుడు గుండు హనుమంతరావుకు తెలంగాణా ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ఆయన చికిత్స నిమిత్తం 5 లక్షల నగదును ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి విడుదల చేసినట్టు మంత్రి కేటీఆర్ తన ట్విటర్ లో తెలిపారు. గుండు హనుమంతరావు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇటీవలే గుండు హనుమంతరావు ఆరోగ్య పరిస్థితిని మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లగా..ఆయన రూ. 2 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. కాగా-ఇబ్బందుల్లో ఉన్న మరో నటుడు పొట్టి వీరయ్యకు కూడా చిరంజీవి 2 లక్షల సాయాన్ని అందజేసిన సంగతి తెలిసిందే.