Vangaveeti-Radha-17-1-15

బెజవాడలో దివంగత వంగవీటి రంగా విగ్రహం విధ్వంసం ఉద్రిక్తతకు దారి తీసింది. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు పోలీసులకు దొరికితే అదృష్టవంతులు అని, రంగా అభిమానులకు దొరికితే మాత్రం వారి ఖర్మ అని వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి సింగ్ నగర్‌లో రంగా విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలిసిన రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో పాటు రంగా అభిమానులు, వైసిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పోలీసులు శిక్షించాలన్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీ ఫుటేజీ చూస్తున్నారని తెలుస్తోందని, వారు చూస్తున్నందున తాము ఇప్పుడు ఏమీ అనలేమన్నారు.

ఫుటేజీని పరిశీలించిన తర్వాత మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు పోలీసులకు చిక్కితే అదృష్టవంతులు అవుతారని, అభిమానులకు దొరికితే మాత్రం వారి ఖర్మ అని హెచ్చరించారు. సిసి కెమెరాలు పరిశీలించి నిజాలను నిగ్గుతేల్చాలన్నారు. పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. రంగా అభిమానులకు దొరికితే వారు తాట తీస్తారని రాధాకృష్ణ అన్నారు.