Venkaiah-Naidu-in-jagan-shirt

వైఎస్ జగన్ అంటే ముందుగా గుర్తొచ్చేది చారల చొక్కాలే. ఆయన చారల చొక్కాలకు కొన్నాళ్లు బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించారు. ఎక్కడకు వెళ్లినా చారల చొక్కాలోనే దర్శనమిచ్చేవారు. చివరకు ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్ కూడా జగన్ కార్టూన్ వేసేటప్పుడు చారల చొక్కాలోనే వేసేవారు.

అంతగా పాపులర్ అయ్యారు జగన్. ఇక వెంకయ్యనాయుడు విషయానికి వస్తే సీనియర్ పొలిటీషియన్ అయిన ఆయన ఎప్పుడూ తెల్లటి దుస్తుల్లోనే కనిపించేవారు. అలాంటింది. తాజాగా ఆయన జగన్ ఫేం చారల చొక్కాలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు.

హైదరాబాద్ లో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను బాలకృష్ణతో కలసి చూసిన సమయంలో ఆయన చారల చొక్కావేసుకుని కనిపించారు. పోనీలెండి.. సినిమా కార్యక్రమం కదా.. కాస్త సరదాగా చారలచొక్కాలోకి మారినట్టున్నారు కేంద్రమంత్రివర్యులు. ఏదేమైనా ఈ మార్పు బావుంది.