November 13, 2017

anil-kumar-yadav-balakrishna

నందమూరి బాలకృష్ణపై నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రమైన కామెంట్లు చేశారు. పిచ్చి ఉందనే సర్టిఫికెట్ తో ఓ కేసు నుంచి బాలకృష్ణ బయటపడ్డాడన్నారు. ఏదైనా మీటింగ్ కు వెళితే మీరు ఎవరినీ కొట్టకపోతే వింత అంటూ బాలకృష్ణపై విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించిన టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణపై అనిల్ కుమార్ యాదవ్ ప్రతివిమర్శలు చేశారు. ఈరోజు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘'బాలకృష్ణ గారూ!, అయ్యా, నువ్వు కూడా మాట్లాడటం మొదలు పెడుతున్నావు.

నీకు పిచ్చి ఉందనే సర్టిఫికెట్ తో కేసులో నుంచి తప్పించుకున్న మాట వాస్తవం కాదా? ‘నాకు పిచ్చి ఉంది, మతి స్థిమితం లేదు..మానసిక పరిస్థితి సరిగా లేదు’' అని చెప్పి ముంబైలోని ఓ ఆసుపత్రి నుంచి సర్టిఫికెట్ తీసుకుని ఒక కేసులో నుంచి నువ్వు తప్పించుకున్నావు. మీ తండ్రిని వెన్నుపోటు పొడిచిన మీ బావ వెంట పారిపోయిన నువ్వు..జగన్మోహన్ రెడ్డిగారిని విమర్శించడం సిగ్గుచేటంటూ విమర్శించారు. ఒక మహనీయుడికి ఎలాంటి కొడుకులు పుట్టకూడదనే దానికి నిదర్శనం మీరు అయితే, పులి కడుపున పులే పుడతాడని చెప్పడానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, బాలకృష్ణ ఏదైనా మీటింగ్ కు వెళితే ఎవరిని కొట్టకపోతే వింత.. అటువంటి నువ్వు ప్రజల గురించి మాట్లాడటం, జగన్ ని విమర్శించడం సిగ్గుచేటని అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.