August 08, 2017

balakrishna-17-8-8

గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి ఓవర్సీస్‌లో 1.6 మిలియన్‌ డాలర్లకి పైగా గ్రాస్‌ వసూలయింది. అంటే మన రూపాయలలో పది కోట్ల పైగానే గ్రాస్‌ వచ్చింది. అంటే షేర్‌ అయిదు కోట్ల పైమాటే అన్నమాట. ఇంత పెద్ద హిట్‌ ఇచ్చిన బాలయ్య తదుపరి చిత్రంపై మార్కెట్లో ఖచ్చితంగా క్రేజ్‌ వుండాలి. కానీ 'పైసా వసూల్‌' చిత్రానికి ఓవర్సీస్‌లో రేటు పలకలేదు.

పోటీ లేని వాతావరణంలో వస్తున్నా కానీ 'శాతకర్ణి' క్రెడిట్‌ దీనికి ఇవ్వడానికి అక్కడి బయ్యర్లు నిరాకరించారు. దీంతో రెండు కోట్ల లోపే 'పైసా వసూల్‌' డీల్‌ సెటిలయిందని టాక్‌ వుంది. దీనికి కారణం పూరి జగన్నాథ్‌ రీసెంట్‌ ట్రాక్‌ రికార్డేనట. టెంపర్‌ మినహాయిస్తే అతని రీసెంట్‌ చిత్రాలకి ఓవర్సీస్‌లో కనీసం ప్రింట్లు, పబ్లిసిటీ ఖర్చులు కూడా తిరిగి రాలేదు. బాలకృష్ణ గత చిత్రానికి క్రిష్‌ ఫ్యాక్టర్‌తో పాటు చారిత్రిక చిత్రమనే అడ్వాంటేజ్‌ తోడయిందని, పూరి తీసే సగటు మాస్‌ సినిమాలకి యుఎస్‌లో డాలర్లు రాలవని బయ్యర్లు తేల్చి చెప్పడంతో ఇక వారితో బేరాలు ఆడలేక, స్వయంగా విడుదల చేసుకునే రిస్కు తీసుకోలేక వచ్చిన దాంతో సరిపెట్టుకున్నారని భోగట్టా.

ఒకవేళ పూరి సర్‌ప్రైజ్‌ హిట్‌ ఇస్తే మాత్రం తక్కువ రేటుకి కొన్న డిస్ట్రిబ్యూటర్‌కి జాక్‌పాటే. ఇంత తక్కువ కూడా తిరిగి రాబట్టలేకపోతే పూరి తదుపరి చిత్రాలకి బయ్యర్లు దొరకడం కష్టమే.