June 15, 2017

charmi-kaur-in-gurudwara

ఈమధ్య కాలంలో పూరి జగన్నాథ్ హీరోయిన్ చార్మీల మధ్య పెరిగిపోతున్న సాన్నిహిత్యానికి బంధించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో కొన్ని దేవాలయాలలో మహిళల పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయమని పెద్ద ఎత్తున మహిళా సంఘాలు భారీ స్థాయిలో ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఉద్యమాలకు అత్యున్నత న్యాయ స్థానాలు కూడ మహిళల ఉద్యమాలకు తమ సంఘీభావం తెలియచేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా స్త్రీలు ఆలయాలలోకి దర్శనం కోసం వచ్చే సమయంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలి అని ప్రముఖ ఆలయాల నిర్వాహకులు అంటున్నారు.

అయితే ఈ విషయాల పై కూడ తమ వస్త్రధారణ పై ఆంక్షలు ఎందుకు విధిస్తారు అంటూ చాల మహిళా సంఘాలు ఈవిషయం పై కూడ ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ ఉద్యమాలకు చాలామంది టాప్ మహిళా సెలెబ్రెటీలు తమ మద్దతు తెలియచేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఛార్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వివాదానికి కారణం అవుతున్నాయి.

ప్రస్తుతం ఛార్మీ పోర్చుగల్ లో పూరిజగన్నాథ్ బాలకృష్ణతో తీస్తున్న లేటెస్ట్ సినిమా షూటింగ్ కు తన సలహాలు ఇస్తూ పోర్చుగల్ లో సందడి చేస్తోంది. అయితే పనిలో పనిగా ఛార్మీ పోర్చుగల్ లోని ఒక గురుద్వారాన్ని సందర్శించి ఆ ఫోటోలను తన ఫేస్ బుక్ లో షేర్ చేసింది.

అయితే ఎంతో పవిత్రమైన గురుద్వారా ప్రాంతంలో ఛార్మీ మోకాళ్ల వరకు మాత్రమే వేసుకున్న డ్రెస్ తో పోజులు ఇస్తూ ఫోటోలు తీయించుకున్న నేపధ్యం వివాదాలకు కారణం అవుతోంది. ఛార్మీ అభిమానులు కూడ ఇటువంటి డ్రెస్ తో గురుద్వారాలో ఛార్మీ సందడి ఏమిటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయాలు అన్నీ పూరిజగన్నాథ్ దృష్టికి రావడంతో సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చను చూసి తల పట్టుకుంటున్నట్లు టాక్.