November 13, 2017

chiru-fan-marriage

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు కొదవేముంది? పశ్చిమగోదావరిజిల్లా కడియంకు చెందిన ఆకుల భాస్కరరావు కూడా చిరుకి హార్డ్ కోర్ ఫ్యాన్. అయితే, తన పెళ్లిని కూడా తన అభిమాననటుడి ముందే చేసుకోవాలని భావించాడు. అంతే చిరంజీవి ఉన్న పెద్ద ఫ్లెక్సీ చేయించి దానిముందే పెళ్లి తంతు జరుపుకున్నాడు.

ఈ విషయం సోషల్ మీడియా పుణ్యమాని ఆచేతా ఈచేతా చిరుకి చేరింది. అభిమానానికి మురిసిపోయిన చిరంజీవి... తన బొమ్మ ఫ్లెక్స్ పెట్టుకుని పెళ్లిచేసుకున్న తన అభిమాని భాస్కర్ రావుని సతీ సమేతంగా ఇంటికి ఆహ్వానించి పట్టు బట్టలుపెట్టి.. ఆశీర్వదించి పంపించాడు. అనంతరం భాస్కరరావు తన భార్యతో కలిసి రంగస్థలం సెట్స్‌లో రామ్‌చరణ్‌ని కూడా కలుసుకున్నారు. కొత్త జంటను రామ్‌చరణ్ రిసీవ్ చేసుకుని, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.