November 13, 2017

ferry-tragedy-krishna-river

పవిత్రసంగమం వద్ద బోటు తిరగబడిన ప్రమాదంలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రభాకర రెడ్డి, కోటేశ్వరరావులు మృత్యువాత పడ్డారు. ప్రభాకర రెడ్డి వాకర్స్‌ అసోసియేషన్‌ కోశాధికారి. అతనే వాకర్లను ఈటూర్‌కు తీసుకువచ్చారు. ప్రమాదంలో ప్రభాకర్‌ రెడ్డి భార్య శ్రీలక్ష్మి సురక్షితంగా భయటపడ్డారు. వీరి మృతికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు రేగళ్ల రఘునాథ రెడ్డిలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

రేటు తక్కువ కావడంతో :

వారంతా తొలుత ఒక్కొక్కరికీ రూ.500 అనే సరికి షికారు మానేద్దాం అనుకున్నారు. దీంతో బోటు వాడు ఒక్కొక్కరికీ కేవలం రూ.300లు ఇవ్వండి అనడంతో వారంతా తిరిగి బోటులో పవిత్ర సంగమం వద్దకు బయలుదేరి మృత్యువాత పడ్డారు.

సేవలందించిన జూనియర్‌ డాక్టర్లు :

బోటు ప్రమాదం నుంచి బయట పడిన వారికి వైద్య సహాయం చేసేందుకు విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి నుంచి సుమారు 10 మంది జూనియర్‌ వైద్యులు పవిత్ర సంగమం వద్దకు వచ్చారు.