December 03, 2017

agnathavasi-title-17

పవ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కల్యాణ్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం `అజ్ఞాత‌వాసి`. వంద కోట్ల బ‌డ్జెట్‌తో త‌యారైన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 150 కోట్ల రూపాయ‌ల బిజినెస్ చేసింద‌ని చెబుతున్నారు. సంక్రాంతికి విడుద‌ల కాబోతున్న ఈ సినిమా గురించి ప‌వ‌న్ అభిమానులే కాకుండా ప్రేక్ష‌కులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమా క‌థ‌కు ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తి అని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. `ది హెయిర్ అప్పారెంట్‌` సినిమాను స్ఫూర్తిగా తీసుకుని `అజ్ఞాత‌వాసి` క‌థ‌ను త్రివిక్ర‌మ్ రెడీ చేశాడ‌ని అంటున్నారు.

`ది హెయిర్ అప్పారెంట్‌` క‌థ ప్ర‌కారం.. ఓ ధ‌న‌వంతుడు అనుకోకుండా ఓ ప్ర‌మాదంలో చ‌నిపోతాడు. అత‌నికి ఇద్ద‌రు భార్య‌లు. అత‌ని మొద‌టి భార్య‌కు ఓ కొడుకు ఉంటాడు. అత‌ను ఎక్క‌డో అజ్ఞాతంలో ఉంటాడు. మ‌రోవైపు చ‌నిపోయిన ధ‌న‌వంతుడి ఆస్తిని కాజేయ‌డానికి ఓ ముఠా కుట్ర ప‌న్నుతుంది. ఆ కొడుకు స‌హాయంతో రెండో భార్య ఆ ముఠాను ఎలా ఎదుర్కొంది అనేదే ఆ సినిమా క‌థ‌. ఆ క‌థ‌ను స్ఫూర్తిగా తీసుకుని త్రివిక్ర‌మ్ తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఓ మంచి క‌థ‌ను సిద్ధం చేశార‌ట‌. ఈ క‌థంతా నిజ‌మో, కాదో తెలియాలంటే జ‌న‌వ‌రి ప‌దో తేదీ వ‌ర‌కు ఆగాల్సిందే.