January 09, 2018

kalyan-ram-son-sourya

ఎన్టీయార్ మీద మూడు బయోపిక్ లు రాబోతున్నట్లు మొన్నటివరకూ ఒక స్థాయి రచ్చ జరిగిపోయింది. సోషల్ మీడియాలో బాగా హడావిడి చేసిన వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ ఇంకా సెట్స్ మీదకే రాలేదు. సెట్స్ మీదకొచ్చిన ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ చప్పుడు చప్పున ఆగిపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు నందమూరి ఇలాకా నుంచే ప్లాన్ చేసిన ఒరిజినల్ బయోపిక్ వార్తల్లోకొచ్చేసింది. ఈనెల 18న ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా బయోపిక్ టీజర్ రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది.

టీజర్ రషెస్ కోసం ఇప్పటికే షూట్స్ లో బిజీగా వున్నాడు డైరెక్టర్ తేజ. అయితే.. కాస్టింగ్ విషయంలో సగం క్లారిటీ మాత్రమే వచ్చిందట. ఎన్టీయార్ ‘బాల్యం’ క్యారెక్టర్ కోసం.. వెతికివెతికి ఎన్టీయార్ ఇంట్లోనే ఒక బుడతడ్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కొడుకు శౌర్యరామ్.. ఆకార, ఆహార్యాల్లో అచ్చుగుద్దినట్లు ఎన్టీయార్ లాగే ఉండడంతో.. అతడినే ఖరారు చేద్దామని తేజ ఫిక్సయ్యాడు. టీజర్లో సైతం బాల ఎన్టీయార్ కి చోటున్నట్లు సమాచారం. మరోవైపు, ఎన్టీయార్ సతీమణి బసవతారకం పాత్ర కోసం ఆర్టిస్టుల్ని వడబట్టడం జరుగుతోంది. ఎన్టీయార్ బయోపిక్ మీద ఇంకాస్త ‘క్లియర్ పిక్చర్’ రావాలంటే ఈనెల 18 దాకా వెయిట్ చేయాల్సిందే.