January 09, 2018

modi-wife-suseela

ప్రధాని మోదీ భార్య యశోదా బెన్ ను ఆయన భార్యగా చేరదీసి గౌరవించాలని, లేదా జెడ్ కేటగిరీ భద్రత తొలగించి ఆమెకు స్వేచ్చ ప్రసాదించాలని కోరుతూ హైదరాబాద్ లో డాక్టర్ పాలెపు సుశీల అనే మహిళ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మియాపూర్ లో సుమారు 8 రోజులుగా ఆమె చేస్తున్న దీక్షను భగ్నం చేసిన ఖాకీలు ఆమెను అదుపులోకి తీసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రి లోనూ తాను దీక్ష కొనసాగిస్తానని సుశీల సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలినని చెప్పుకునే ఈమె.. హైందవ మహిళల గౌరవాన్ని, స్వేచ్చను కాపాడేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొంటున్నారు.