January 09, 2018

mukhtar-ansari-with-wife

గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయనేతగా అవతారమెత్తిన యూపీలోని బహుజన్ సమాజ్ వాదీ (బీఎస్‌పీ) ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీకి మంగళవారంనాడు బాందా జైలులో గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అన్సారీని చూసేందుకు జైలుకు వచ్చిన ఆయన భార్య కూడా ఆయన పరిస్థితి చూసి తీవ్ర అస్వస్థకు గురికావడంతో ఆమెను సైతం అధికారులు ఆసుపత్రికి తరలించారు.

ముఖ్తార్ అన్సారీ గత ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన 'ఖ్వామి ఏక్తా దళ్' పార్టీని బీఎస్‌పీలో విలీనం చేశారు. అనంతరం మవు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే నియోజవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన రికార్డు ఆయనకు ఉంది. వివిధ క్రిమినల్ కేసుల్లో 2015 నుంచి ఆయన జైలులో ఉంటున్నారు. 2016 జూన్‌లో అన్నారీ తన 'క్యూఈడీ' పార్టీని శివపాల్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీలో కలుపుతానని ప్రకటించారు. అయితే అఖిలేష్ యాదవ్ ఈ నిర్ణయంతో విభేదించారు. దీంతో తన నిర్ణయాన్ని మార్చుకున్న అన్సారీ 2017లో తన పార్టీని బీఎస్‌పీలో కలిపేశారు. ఆ తర్వాత బీఎస్‌పీ అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిచారు.