August 08, 2017

nithin-17-8-8

నితిన్ స్పీడ్ పెంచాడు. విపరీతమైన పోటీ తన లై సినిమాను ఇబ్బంది పెడుతుంది అని గుర్తించి తనే స్వయంగా రంగంలోకి దిగాడు. ప్రమోషన్స్ లో విస్తృతంగా పాల్గొంటూ ఎవరు పిలిచినా ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నాడు. సినిమా మీద నమ్మకం ఉన్నప్పటికీ మూడు ఈక్వల్ రేంజ్ ప్రాజెక్ట్స్ బరిలో దిగటంతో ప్రేక్షకులు ఏమోగాని డిస్ట్రిబ్యూటర్లు మాత్రం చుక్కలు చూస్తున్నారు. థియేటర్ల పంపకాల విషయంలో ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదని టాక్.

ఇంతకు ముందు వచ్చిన ఫిదా, నిన్ను కోరి ఇంకా స్వింగ్ లోనే ఉండగా ఎంత ఫ్లాప్ అయినా నక్షత్రం ఇంకో వారం స్పేస్ కోరుతుంది కాబట్టి సర్దుబాటు చేయటం కష్టంగా ఉంది. వీటికి తోడు అక్షయ్ కుమార్ టాయిలెట్ సినిమా కూడా అదే రోజు వస్తోంది. సో పెద్ద రచ్చే జరగబోతోంది. ఇక లై విషయానికి వస్తే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో పూరి సినిమా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ప్రెస్ మీట్ లో నితిన్ కు ఒక ప్రశ్న ఎదురైంది. పూరి జగన్నాధ్ తో సినిమా అనుకున్నారు కదా అది ఎంతదాకా వచ్చింది అని అడిగారు. దాంతో నితిన్ అటువంటిది ఏమి లేదు, అప్పుడు అనుకున్న మాట నిజమే కాని ఆ కథ ఇప్పటి ట్రెండ్ కు సెట్ కాదు, మాట్లాడ్డం కూడా వేస్ట్ అన్న రీతిలో ఆన్సర్ చెప్పడంతో అందరు షాక్ తిన్నారు. నిజానికి నితిన్ కంటే పూరి ఎన్నో మెట్లు పైన ఉన్నాడు.

డ్రగ్స్ కేసు, వరస ఫ్లాపులు అనేవి పక్కన పెడితే ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీసిన మాస్టర్ డైరెక్టర్. అతను చెప్పిన దాన్ని డైరెక్ట్ గా వేస్ట్ అనడం కరెక్ట్ కాదు. ఇప్పట్లో కుదరదనో, లేక మంచి కథ కోసం వెతుకుతున్నామనో చెబితే పోయే దానికి ఏకంగా వేస్ట్ అనే పదం వాడటం మాత్రం సబబు కాదు అంటున్నారు. రేపో ఒక హిట్ కొడితే ఇప్పుడు వద్దన్న చేతులే మళ్ళి పూరి దగ్గర క్యు లో నిలబడతాయి. టైం కి ఏది ఎలా జరుగుతోందో చెప్పలేం కదా.