December 03, 2017

pawan-trivikram-agnathavasi-17-12

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమా టైటిల్ విషయంలో త్రివిక్రమ్ ఎంతగా ఉరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవ్వరికీ తెలియకుండా అజ్ఞాతవాసి అని మెల్లగా వదిలి అభిమానులకు నచ్చిందా లేదా అనే విషయాన్ని అనుమానం రాకుండా కనుక్కొని వారి ఇష్ట ప్రకారమే తన మొదటి ఛాయిస్ టైటిల్ ను ఫిక్స్ చేశాడు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో త్రివిక్రమ్ ఎప్పుడూ ఆలోచించని విధంగా ఆలోచించాడని తెలుస్తోంది.

ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ కుష్బూ ఒక పాత్రను చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా కథ మొత్తంగా ఆమె చూట్టే తిరుగుతుందట. ఆమె పాత్ర సినిమాకి హైలెట్ గా నిలుస్తోంది అని సమాచారం. ఇకపోతే మొదట కుష్బూ పాత్రకి సెట్ అయ్యే విధంగా మాటల మాంత్రికుడు టైటిల్ ను సెట్ చేసుకున్నాడట. కానీ ఆ తర్వాత అభిమానుల కోరిక వల్లనో మరొక కారణం వల్లనో గాని మొత్తానికి అజ్ఞాతవాసి అని సెట్ చేసి.. ప్రిన్స్ ఇన్ ఎక్సైల్ అనే స్వీట్ క్యాప్షన్ ఇచ్చాడు.

దీంతో అభిమానులు అనుకున్నట్లుగా అజ్ఞాతవాసి సెట్ అయ్యిందని హ్యాపీ గా ఫీల్ అయ్యారు. అలాగే సినిమా కథ ప్రకారం టైటిల్ పెట్టాలని త్రివిక్రమ్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకు స్టార్ హీరో ఇమేజ్ కూడా ఓ విధంగా ఆయన పెన్ కి అడ్డుపడదనే చెప్పాలి. ఇంతకుముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలను చూస్తే టైటిల్స్ సినిమా మొత్తానికి ఎలా కనెక్ట్ అయ్యాయో అర్ధమవుతోంది. ఇప్పుడు అజ్ఞాతవాసి కూడా అలాగే ఉండొచ్చనమాట.