June 15, 2017

rangasthalam-1985-pic

చరణ్‌ సినిమాలకి ఫైనల్‌ కట్‌ డిసైడ్‌ చేసే ముందు చిరంజీవికి చూపించడం రివాజు. అయితే ఈ సెంటిమెంట్‌ని 'రంగస్థలం' చిత్రానికి పాటించబోరట. ఈ చిత్రానికి ఫైనల్‌ కట్‌ నిర్ణయాధికారం సుకుమార్‌కి తప్ప ఇంకెవరికీ వుండకూడదని చరణ్‌ ముందే డిసైడ్‌ అయ్యాడట.

ఈ చిత్రం విషయంలో దేనికైనా సుకుమార్‌దే ఫైనల్‌ డెసిషన్‌ అంటున్నాడట. 'రంగస్థలం' పేరు చెప్పినప్పుడు చిరంజీవి అభ్యంతరం వ్యక్తం చేసాడట. మాస్‌ అప్పీల్‌ వున్న టైటిల్‌ పెట్టమని సూచించాడట. ఎంత ప్రయెగాత్మక చిత్రమైనా కానీ టైటిల్‌ విషయంలో మాస్‌ అప్పీల్‌ చూసుకోవాలని సలహా ఇస్తే, సుకుమార్‌ ఇష్టానికే చరణ్‌ ప్రాధాన్యమిచ్చాడట. అలాగే ఈ చిత్రం ఫైనల్‌ ఎడిట్‌ విషయంలోను చిరంజీవి సలహాలు తీసుకోబోవడం లేదని సమాచారం.

చరణ్‌ గత చిత్రం 'ధృవ'కి కూడా మెగాస్టార్‌ సలహాలేమీ అడగలేదు. ఆ చిత్రంలో హీరో కంటే విలన్‌ హైలైట్‌ అయ్యాడని చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలొచ్చాయి. చిరంజీవిది పాత తరహా కమర్షియల్‌ పద్ధతి కనుక తను చేయాలనుకుంటోన్న కొత్త రకం చిత్రాలకి మెగాస్టార్‌ సలహాలు లేకపోతేనే బెటర్‌ అని చరణ్‌ డిసైడ్‌ అయినట్టున్నాడు. ఇకపోతే 'రంగస్థలం' టైటిల్‌ ఎంత హెవీగా వున్నా సినిమా మాత్రం చాలా వినోదాత్మకంగా వుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం రైజింగ్‌లో వున్న కమెడియన్లు అందరినీ సుకుమార్‌ ఇందులో కాస్ట్‌ చేస్తున్నాడట.