August 08, 2017

spyder_Karan-johar

స్పైడర్ మూవీతో తెలుగుతో పాటు తన మార్కెట్ ను పెంచుకునేందుకు మహేశ్ బాబు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన అప్ కమింగ్ మూవీ స్పైడర్ ను తెలుగుతో పాటు తమిళ, హింది భాషల్లో కూడా ఒకే తేదీకి విడుదల చేసేందుకు మహేశ్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇక్కడ స్పైడర్ తమిళ వెర్షన్ లో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ బాలీవుడ్ లో మాత్రం దర్శకనిర్మాత కరణ్ జోహర్ మాత్రం అడ్డంకిగా మారాడట. ఈ సినిమాను బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో రీమేక్ చేయాలని కరణ్ భావిస్తున్నాడట. అందుకే హిందీలో ఈ సినిమాని డబ్ చేయోద్దని కరణ్, స్పైడర్ దర్శకనిర్మాతల్ని పట్టుబడుతున్నాడని సమాచారం. అయితే ఈ విషయం పై ఇప్పటివరకు హృతిక్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, త్వరగా తన డెషిషన్ చెప్పాల్సింగా కరణ్ ని స్పైడర్ మేకర్స్ అడిగినట్లు తెలిసింది.

దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పైడర్ కు బాలీవుడ్ లో కూడా బిజినెస్ జరిగితేనే ఆశించినంత స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే నార్త్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువుగా కనిపిస్తున్నాయి. మరి స్పైడర్ పై కరణ్ కరుణ పడే టైమ్ కి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.