August 08, 2017

venkatesh-17-8-8

బాహుబలి సినిమా సక్సెస్ వెంకీని బాగా టచ్ చేసినట్టుంది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బాహుబలి రేంజ్ లో చేసేందుకు రెడీ అవుతున్నాడు వెంకీ. సీనియర్ టాలీవుడ్ స్టార్ హీరో అయిన విక్టరీ వెంకటేష్ న్యూ మూవీ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఏడాదిపాటు ఏమాత్రం కంగారు పడకుండా మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూసిన వెంకీ, ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యాడట. స్క్రిప్ట్ ప్రకారం ఈ మూవీలో 60% గ్రాఫిక్స్ వుంటాయని.. దీంతో మూవీ బడ్జెట్ కూడా భారీగానే వుంటుందని చెబుతున్నారు. ఈ మూవీని సొంతంగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చేయబోతున్నాడట నిర్మాత సురేష్ బాబు.

ఈ సినిమాకి గ్రాఫిక్ వర్క్ ఇంపార్టెంట్ కాబట్టి పక్కాగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క చేసిన తరువాతే మూవీ షూటింగ్ మొదలుపెడతారట. గ్రాఫిక్స్ సహాయంతో సిల్వర్ స్కీన్ మీద వండర్స్ క్రియేట్ చేయొచ్చని బాహుబలితో ప్రూవ్ అయింది. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాఫికల్ వండర్ మూవీని తీయాలని సురేష్ బాబు పక్కా ప్లానింగ్ తో వున్నాడట. సో వెంకీ న్యూ మూవీ బాహుబలి స్థాయి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.